ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ను వెంటనే ఆపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు పూజారి సమ్మయ్య (టిఆర్ఎస్కెవి) అన్నారు.
శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 28 29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది
ఈ సందర్భంగా సోమన్న. సమ్మయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. దారిద్ర్య రేఖ దిగువన తెల్ల రేషన్కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు నగదు ఇవ్వాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్. డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కొడ్ లను రద్దు చేసి దేశాన్ని రక్షించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. అన్ని కార్మిక సంఘాలు.యూనియన్లు. అసంఘటిత. సంఘటిత ఉద్యోగ కార్మికులు అన్ని రంగాలకు చెందిన వారు దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అమాలి యూనియన్ నాయకులు దేశ బోయిన రాములు. షేర్ సోమయ్య. మామిండ్ల నరసయ్య. ఎండి మైబు. ఎండి అబ్బాస్. ఎండి గుంశ. చిక్కుడు పరమేష్. షేర్ అంజయ్య. దాసరి యాదగిరి. చిట్యాల నాగన్న.తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.