సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు


సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు

జనగామ రైల్వే స్టేషన్ ఎదుట నిరసన తెలియజేస్తున్న సిఐటియు ప్రజా సంఘాల కార్యకర్తలు

జనగామ: కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా రైల్వే స్టేషన్ ఎదుట సిఐటియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లే కార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిఐటియు జిల్లా కోశాధికారి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశానికి సంపద సృష్టించే కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని అంబానీ ఆదాని బడా కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అమ్మేస్తుంది అని తీవ్రంగా మండిపడ్డారు విమానయానం రైల్వే, బ్యాంక్ ఇన్సూరెన్స్ ,రక్షణరంగం ఎల్ఐసి విశాఖ స్టీల్ ప్లాంట్, బొగ్గు గనులు దేశప్రజల కార్మికుల శ్రమ శక్తితో నిర్ణయించుకున్నా ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని ప్రైవేట్ పరం చేయడం సిగ్గుచేటని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం దేశభక్తి భావాలు కలిగిన ప్రతి భారతీయుడు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థల కాపాడుకోవడం కోసం సిఐటియూ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతాయని పోరాటాలలో ప్రజలు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ సిఐటియు జిల్లా టౌన్ నాయకులు జీ మల్లేష్ రాజు మచ్చా వెంకటేశ్వర్లు చిదిరాల ఉపేందర్ ఎండి మునీర్ దేవరకొండ శేఖర్ గూడూరు రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి సందీప్ డివైఎఫ్ఐ నాయకులు దూసరి నాగరాజు గిరిజన సంఘం జిల్లా నాయకులు అజ్మీర సురేష్ , సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.