ప్రభుత్వ రోడ్స్ ను కబ్జా చేసిన వ్యక్తుల పై చర్య తీసుకోవాలని డిమాండ్

ప్రభుత్వ రోడ్స్ ను కబ్జా చేసిన వ్యక్తుల పై చర్య తీసుకోవడంలో తాండూర్ మండలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం పై చర్య తీసుకోవాలని డిమాండ్
అదనపు కలెక్టర్ గారికి ఫిర్యాదు సిపిఎం,చత్రపతి శివాజీ యువజన సంఘం

ఈరోజు సిపిఎం చత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ గ్రామస్తులు మాట్లాడుతూ తాండూర్ మండలం అల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వ రోడ్ ని కబ్జా చేసుకొని అక్రమంగా ఇంటిని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్న వ్యక్తి పై చర్య తీసుకోవాలని గత నెల రోజుల నుండి తాండూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన సర్వే చేయించి అక్రమం అని తేలినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకుండా అక్రమంగా నిర్మించిన ఇంటిని, కంపౌండ్ వాల్ ని కూల్చి వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరు. అందుకు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలందరికీ రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు రోడ్లు అన్యాక్రాంతమైన రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు అక్రమంగా కబ్జా చేసిన వారికి కొంతమంది నాయకులు వత్తాసు పలకడం వారితో సన్మానాలు చేసుకోవడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు తాండూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చత్రపతి యువసేన సంఘం గ్రామస్తులు యాదయ్య గౌడ్ రమేష్ రవికుమార్ నవీన్ గౌడ్ మహేష్ ప్రశాంత్ గౌడ్ సునీల్ గౌడ్ నరేందర్ గౌడ్ నవీన్ గౌడ్ శ్రవణ్ గౌడ్ మోహన్ rathod అంజిలప్ప ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.