ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్

ముజఫర్ ఆరోగ్యం జాగ్రత్త, పోన్ లో కానిస్టేబుల్ తో మాట్లాడి దైర్యం చెప్పిన జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్.. డోర్నకల్ లో పని చేస్తున్న ముజపర్ అనే పోలీస్ కానిస్టేబుల్ రెండురోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడి ఖమ్మంలోని ఓ..ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డోర్నకల్ సిఐ శ్రీనివాస్ ద్వారా విషయం తెలుసుకున్న జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ మానవత్వంతో స్పందించారు. సిఐ శ్రీనివాస్ ను ఆసుపత్రికి పంపించి కానిస్టేబుల్ తోనూ, వారి కుటుంబసభ్యులతోనూ మాట్లాడించారు. జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ సహితం కానిస్టేబుల్ తో పోన్ లో మాట్లాడారు. ప్రమాద వివరాలు తెలుసుకోవడంతోపాటు.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండని దైర్యం చెప్పారు. అదైర్యపడాల్సిన అవసరం లేదని అన్ని వేళల అండగా ఉంటామంటూ భరోసా అందించారు. జిల్లాఎస్పీ స్వయంగా పోన్ చేసి దైర్యం చెప్పిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంచిమనసు ఆ..కానిస్టేబుల్ కుటుంబాన్ని కదిలించింది.. ఆ..కానిస్టేబుల్ అంత ఇబ్బందిలోనూ ఆనందం వ్యక్తం చేసి దన్యవాదాలు తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.