వాహన దారులు,ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండడం కోసం దేవరుప్పుల మండలంలో ఉన్న ప్రధాన చౌరస్తాలు,ములమలుపుల వద్ద వరంగల్ పోలీస్ కమిషనర్ డా తరుణ్ జోషి ఆదేశాల మేరకు దేవరుప్పుల ఎస్ .ఐ ఎమ్ రాజు తన సిబ్బంది తో కలిసి ప్రమాద హెచ్చరిక ప్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా ఎస్.ఐ. ఎమ్ రాజు మాట్లాడుతూ ప్రజలు ,వాహన దారులు ముందస్తు ప్రమాదహెచ్చరిక సూచనలు లేక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటి వల్ల తమ ప్రాణాలు కోల్పోవడమే కాకా అమాయక ప్రజలు నిండు ప్రాణాలు కోల్పోతున్నారని, వాహన దారులు రాంగ్ రూట్ డ్రైవింగ్ ,మద్యం సేవించి, అతివేగంగా వాహనాలు నడుపరదని,సెల్ ఫోన్ మాట్లాడుతూ, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని అన్నారు
ఒకవేళ వాహన దారులు ఇట్టి నిబంధనలు ఉల్లంగిస్తే సహించేది లేదని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు