ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి పట్ల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన సంతాపాన్ని తెలియజేశారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మద్దాల ప్రభాకర్,షేక్ బషీరుద్దీన్ లు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షేన్ వార్న్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, కేవలం 52 సంవత్సరాలకి క్రికెట్ దిగ్గజం చనిపోవడం బాధాకరమని వారన్నారు. క్రికెట్ చరిత్రలో షేన్ వార్న్ రికార్డులు ఎప్పటికీ అలాగే ఉంటాయని, ఆయన ఆట తీరు ఎవరు మర్చిపోలేని వారు ప్రశంసించారు. దాదాపు 15 సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ లో తిరుగులేని లెగ్ స్పిన్నర్ గా ఆయన వెలుగొందాలని వారు అన్నారు. ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా షేన్ వార్న్ ఉన్నారని వారు అన్నారు. ఆస్ట్రేలియా తరపున కాక, మన దేశంలో జరుగుతున్న ఐపీఎల్ లో కూడా రాజస్థాన్ జట్టుకు నాయకత్వం వహించి మొదటిసారి ఐపీఎల్ కప్పును గెలిచారని వారు గుర్తు చేశారు. ఆయన వేసే లెగ్ స్పిన్ ఎందరికో ఆదర్శమని, నేటి యువ బౌలర్లులు ఆయన్ను వారి ను చూసి నేర్చుకోవాలని వారన్నారు.
అలాంటి షేన్‌వార్న్ ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ నుండి సంతాపాన్ని ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు చేశారు.
