మహీంద్రా ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య…వివరాల్లోకి వెళితే మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన కొండేటి నాగయ్య ఇల్లు కొరకు లక్షరూపాయలు మహీంద్రా ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్ వద్ద సంవత్సరం క్రితం అప్పు తీసుకోగా కరోనా కారణంగా అప్పు కట్టలేకపోయాడు ఇటీవల ఫైనాన్స్ సంబంధించి ఏజెంట్లు ధర్మాపురం వెళ్లి ఇంటికి తాళం వేస్తామని బాగా వేధించడం వలన ఈరోజు నల్లగొండ పట్టణంలోని ముషంపల్లి రోడ్డులోని చర్చి వెనకాల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడమో జరిగింది మృతునికి భార్య ఇద్దరు పిల్లలు కలరు