ప్రవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలు విరమించుకోవాలి మార్చి 26న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయండి

కేంద్రంలోని Bjp ప్రభుత్వం ప్రవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను రద్దు చేసుకోని ప్రభుత్వ సంస్థలను కాపాడాలని, మార్చి 26న జరిగే భారత్ బంద్లో రైతులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు.

దివి: 20-03-2021శనివారం రోజున స్థానిక cpm జిల్లా కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ సమావేశం Md.అజారుద్దీన్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని Bjp ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు 4 కోడ్ లుగా మార్చి కార్మికుల హక్కులను హరించి వారిని బానిసలుగా మార్చివేస్తున్నదని అన్నారు. 2020 విద్యుత్ బిల్లు పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కేంద్రం రైతులకు ఉన్న రాయితీలు, పేద ప్రజలకు ఉన్న సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేస్తున్నదని విమర్శించారు. అన్నం పెట్టె రైతులకు అన్యాయం చేస్తూ సున్నం పెట్టె కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెడుతున్నదని తెలిపారు. దీనిని నిరసిస్తూ రైతులు, ఉద్యోగులు, కార్మికులు భారత్ బంద్లో పెద్దఎత్తున పాల్గొని మొండి ప్రభుత్వానికి కల్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ ఇర్రి అహల్య, పట్టణ కమిటీ సభ్యులు, జోగు ప్రకాష్, బిట్ల గణేష్, పల్లెర్ల లలిత, మంగ బీరయ్య, పందిళ్ళ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.