pdsc suryapeata news

పిడిఎస్ యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్ర అఖిల్, పుల్లూరు సింహాద్రి

సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి బాలికలకు రక్షణ కల్పించాలని పిడిఎస్యు అధ్యక్ష కార్యదర్శులు పుల్లూరు సింహాద్రి, ఎర్ర అఖిల్ అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ర్యాలీ నిర్వహించి కోర్టు చౌరస్తా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత మూడు సంవత్సరాల క్రితం బాలికలకు హాస్టల్ నిర్మించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయకుండా వదిలేశారని దీనివల్ల బాలికలకు రక్షణ తో పాటు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారని తెలిపారు. హాస్టల్ ప్రక్కనే ప్రభుత్వ జూనియర్ బాయ్స్ కాలేజ్ ఉండడంతో పాటు సాయంత్రం వేళ ఆకతాయిలు తాగి వచ్చి అమ్మాయిల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీనితో పాటు అక్కడే ఓపెన్ జీమ్ ఉండడం వలన అనేకమంది జిమ్ కి రావడం వల్ల బాలికలు అసహనానికి గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే సమాజంలో బాలికలు మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉందని,ఇలాంటి సందర్భాల్లో బాలికలు ఉండే హాస్టల్ కు ప్రహరీ గోడలు లేకుండా గాలికి వదిలేయడం ప్రభుత్వ అధికారుల చేతకానితనానికి నిదర్శనం అని అన్నారు. ఇకనైనా మంత్రి స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసి యుద్ధ ప్రాతిపదికన ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. లేనియెడల పిడిఎస్ ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మించే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు రేఖ ,మాధవి మౌనిక, స్వాతి, మహేశ్వరి, అనుష,వసుంధర తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.