janagama news telugu news ramya news

మహిళ కాంగ్రేస్ మండల అధ్యక్షురాళ్లు చింత జోష్ణ,గాజుల రజినీ కోడారి శ్రీవాణీ

ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ జులై 22

జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు నీల గట్టయ్య కుమారుడు నీల సందీప్ (సుమంత్)అనే యువకుడు గత కొద్ది సంవత్సరాలుగా ఇదే గ్రామానికి చెందిన చొక్కం రమేష్ లక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె చొక్కం రమ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసాడని తన తండ్రి మరియు టిఆర్ఎస్ పార్టీ అండతో దండలతో తప్పించుకు తిరుగుతున్నాడని,తనకు న్యాయం చేయాలని కోరుతూ నీల గట్టయ్య ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్ మరియు మహిళ కాంగ్రేస్ మండల అధ్యక్షురాలులు చింత జోష్ణ,గాజుల రజినీ,కోడారి శ్రీవాణీ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రమ్యకు రేపటి లోగా న్యాయం జరగపోతే పెద్ద ఎత్తునా కాంగ్రేస్ అద్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షులు ఐలాపాక శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరపాక వసంత్ రామ్ చందర్ మహిళ కాంగ్రేస్ మిదికొండ గ్రామశాఖ అస్యక్షురాలు జోగు ప్రశాంతి గట్టు పద్మ షోబ వెంకటమ్మ ధనరేక తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.