ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రణ చేయడంలో ప్రభుత్వం విఫలం

జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలు అదిక ఫీజులు వసూలు చేస్తుంటే విద్యాశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నరనీ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి విమర్శించారు.
ఈరోజు హసన్పర్తి మండల డివైఎఫ్ఐ మహా సభ మంద సుచెందర్ అధ్యక్షతన జరిగింది.
విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 50 శాతం ఫీజులు వసూలు చేశారని, ఫీజులను అరికట్టాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్థలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అందువల్లే ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రైవేటు విద్యా సంస్థలు కనీస ప్రమాణాలు పాటించడం లేదని పాఠశాలల్లోనే పుస్తకాలు బట్టలు ఇతర మెటీరియల్ అమ్ముతున్నారని దాంట్లో అధికారులకు భాగం ఇస్తున్నారని, అందువల్లే చూసీచూడనట్టుగా ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని, ప్రైవేటు విద్యాసంస్థల పై అనేక ఫిర్యాదులు వచ్చిన ఏ ఓక్క పాఠశాల మీద చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు, విద్యా సంస్థల పై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రైవేటు విద్యా సంస్థల పై చర్యలు తీసుకోకుంటే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
డివైఎఫ్ఐ హసన్పర్తి మండల కమిటీ ఎన్నిక
సమావేశానంతరం డివైఎఫ్ఐ హసన్పర్తి మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్ తెలిపారు.
మండల అధ్యక్షులుగా కుర్ర హర్షవర్ధన్, కార్యదర్శిగా వేలు సుమన్, ఉపాధ్యక్షులుగా ఎర్రోజు వెంకటాచారి, నమిండ్ల కుమారస్వామి, ఎస్. తిరుపతి, సహాయ కార్యదర్శి గా ప్రవీణ్ కుమార్, పీ. సాగర్, లతోపాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.