ప్రైవేటు విద్యాసంస్థల ఫీ దోపిడిని ఆపివేయాలి- ఎస్ఎఫ్ఐ డిమాండ్

భరత విద్యార్ధి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విద్యాధికారి DEO గారికి వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా SFI జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు పార్టీ పుస్తకాలు సకాలంలో అందేలాగా చేయాలని అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు వెంటనే అందించాలని మరియు మధ్యాహ్న భోజన పథకంలో సరియైన పద్ధతిలో పోషకాహారంతో కూడుకున్నటువంటి భోజనాన్ని విద్యార్థులకు అందించాలని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మిశ్రీన్ సుల్తానా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఫీజులను వసూలు చేస్తున్నారని అదేవిధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో ప్రభుత్వ జీవో కి విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక ఒత్తిడి పెట్టి అమ్ముతున్నారని. ఈ అంశాలను జిల్లా విద్యాధికారి అయినటువంటి డి వో గారు స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవాలని అలాగే జిల్లా కేంద్రంలో అనుమతి లేని మరియు కనీస అవసరాలు కూడా సరిగ్గా లేని భవనాలకు ప్రైవేటు పాఠశాలలు కొనసాగించడానికి పర్మిషన్ చేయాలని తెలియజేశారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కనీసం వారానికి రెండుసార్లు అయినా పాఠశాల సందేశం అనే పేరుతో పాఠశాలలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఆ పాఠశాలలో కావలసినటువంటి మాలిక సదుపాయాలను అందించడానికి కృషి చేయాలని. ప్రైవేటు విద్యాసంస్థలు విచ్చలవిడిగా పెంచిన ఫీజులు ప్రభుత్వ ఫ్రీ స్ట్రక్చర్ ప్రకారం కొనసాగించాలని అలాగే ప్రతి ప్రైవేటు పాఠశాల ముందు ఫ్రీ స్ట్రక్చర్ బోర్డు ఏర్పాటు చేయాలని దీనికి కావలసినటువంటి చర్యలను డి ఈ ఓ గారు తీసుకోవాలని డి ఈ ఓ గారికి తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల చరన్ యాదవ్ కాకతీయ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి మూలవేణు జిల్లా కమిటీ సభ్యుడు కుశల్ తో పాటు జిల్లా నాయకులు గణేష్ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.