ప్రైవేటు హాస్పటల్లో దోపిడిని అరికట్టాలి: డివైఎఫ్ఐ

వైద్యం పేరుతో హనుమకొండ నగరంలో ప్రవేటు హాస్పటల్ చేస్తున్న దోపిడిని అరికట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఇంఛార్జి డిఆర్ఓ యం.వాసుచంద్ర కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడుతూ
ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వాన్నిబంధనలు తుంగలోకి తొక్కి వేస్తున్నాయని కనీస నిబంధనలను పాటించడం లేదని, ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయని, వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చిన పేషంట్లను నిలువు దోపిడీ చేస్తున్నయని, ఇష్టను సారంగా ఓపి, (టెస్టు)పరీక్షలు, స్కానింగ్ , అడ్మిట్ పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ నియంత్రణ లేదని, ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలని ఉన్నప్పటికీ ఎక్కడ అవి లేదనీ, ప్రైవేటు హాస్పిటల్స్ పిఆర్వోలను పెట్టుకొని ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లి మా హాస్పిటల్ కు మీ దగ్గరికి వచ్చే పేషెంట్లను పంపిస్తే మీకు కమిషన్ ఇస్తామని చెప్తున్నారు. ప్రైవేటు హాస్పటల్ నిర్వహణ మేనేజర్లు పేర్ల తో చేస్తున్నారని వాటికి ఎలాంటి గుర్తింపు లేదని, ఇతర రాష్ట్రాల నుంచి అర్హత లేని డాక్టర్లను తీసుకువచ్చి వైద్యం చేపిస్తున్నారని, హాస్పటల్ నిర్వహణ బిల్డింగ్స్ కు ఫైర్ సేఫ్టీ పార్కింగ్ స్థలాలు లేవని, నాలాలను ఆక్రమించుకొని పార్కింగ్ నిర్వహిస్తున్నారని, అవసరం లేకున్నా టెస్టులు రాస్తూ వాటి పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు, హాస్పిటల్లోనే మెడికల్ షాపు నిర్వహించడం వల్ల డాక్టరు రాసిన కంపెనీ మెడిసిన్స్ తీసుకోవాలని చెప్తున్నారని,హాస్పిటల్ కు ఆపదలో వచ్చే పేషెంట్లను డాక్టర్లు అందినంత దోచుకుంటున్నారు నగరంలోని న్యూరో ,ఆర్థోపెటిక్, గైనకాలజిస్ట్, జనరల్, ఎంఎస్, ఎండి ,చిల్డ్రన్, మల్టీ స్పెషాలిటీ ,సూపర్ మల్టీ స్పెషాలిటీ పేర్లతో హాస్పిటల్ లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి మల్లెపు లక్ష్మణ్, జిల్లా నాయకులు మోతే సతీష్, పల్లకొండ శ్రీకాంత్ పాల్గొన్నా

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.