పామిడి…ప్రభుత్వ ఆదేశాల మేరకు పామిడి మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలను మండల విద్యాశాఖాధికారి జయరామ్ నాయక్ తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో టాయిలెట్స్,పిల్లలకు మంచినీటి సౌకర్యం,కరోనా నిబంధనలు పాటిస్తున్నార లేదా అని తనిఖీ చేసారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ జయరామ్ నాయక్ మాట్లాడుతూ పామిడి మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అమలు చేస్తున్నారు అని తెలియచేసారు అలాగే పాఠశాల ఆవరణలో విద్యార్థులకు మంచి నీరు త్రాగడానికి మంచినీటి కుండలను ఏర్పాటు చేయాలని పాఠశాల హెచ్ యమ్ లకు ఆదేశించారు .ఈ తనిఖీలో భాగంగా పామిడిలోని సరస్వతీ విద్యమందిరం, కృష్ణవేణి హై స్కూల్, త్రినీటి, చైతన్య పాఠశాలలను తనిఖీ చేసారు.