telugu news hanumakonda news cpim news

అడ్మిషన్ , రిజిస్ట్రేషన్ ఫీజులు రద్దు చేయాలని
Shine స్కూల్ ముందు సిపిఎం ధర్నాలో రైతుసంఘం జిల్లా నాయకులూ M .చుక్కయ్య

>
గత వారం రోజులుగా సిపిఎం హనుమకొండ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ ఫీజులపై సర్వేలు నిర్వహించి, వాటిని పరిష్కరించాలని ఈ రోజు (జూన్ 28 ) ప్రైవేట్ స్కూల్స్ ముందు సీపీఎం ధర్నాలు చేపట్టింది.
అందులో భాగంగా ఈ రోజు Shine స్కూల్ ముందు వాంకుడోతు వీరన్న నాయకు అధ్యక్షతన జరిగిన సిపిఎం ధర్నాలో రైతు సంఘం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య మాట్లాడుతూ.., ప్రైవేట్ విద్యాసంస్థలలో GO No 42 గాని,2016లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తిరుపతి రావు కమిటీ ఆధ్వర్యంలో దేశంలో సుమారు 15 రాష్ట్రాలలో ఫీజుల నియంత్రణ ఎలా ఉండి అనేది అధ్యయనం చేసి సంవత్స రానికి 5నుండి 10 శాంతం వరకు పెంచుకోవాలి అని సూచించిన దానికి భిన్నంగా 2019కి ముందు ఉన్న ఫీజులను ఈ విద్యా సంవత్సరంలో 50% నుండి 80%వరకు ఫీజులు, అడ్మిషన్ ఫీజులు ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా పెంచుకొని,పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులను అప్పుల పాలు చేసి, తీవ్ర మానసిక ఒత్తిడులకు గురి చేస్తూ, ఫీజు మొత్తం కూడా ఒకేసారి కట్టాలని, తీవ్రమైన ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు.
గతంలో ఎప్పుడు కూడా అడ్మిషన్ ఫీజులు వసూలు చేయలేదు. కానీ మళ్లీ ప్రైవేటు విద్యా సంస్థలు 5 వేల నుండి 15 వేల వరకు వసూలు చేయడం జరుగుతుంది. ఇది ప్రజలపై మరింత భారం పడుతుంది.
ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు స్కూల్ల పరిమిషన్ సందర్భంగా సమర్పించే అఫిడవిట్ లలో మేము సేవా దృక్పథంతో విద్యా సంస్థలను నడుపుతామని చెప్పి, విద్య ఒక వ్యాపార సరుకుగా మార్చి, అనేక విద్యాసంస్థలు కార్పొరేట్ల స్థాయికి ఎదిగి, తాము తల్లిదండ్రుల నుండి వసూలు చేసిన ఫీజుల దోపిడీ వల్ల లాభాలు సంపాదించి, అలా వలన పెట్టుబడిగా మార్చి కోట్లాది రూపాయల విలువైన స్థిర, చర ఆస్తులను సంపాదించి పేద, మధ్యతరగ తుల విద్యార్థుల తల్లిదండ్రులు మోయలేని భారలు మోపుతున్నారు. కావున పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అడ్మిషన్ ఫీజు లను రద్దు చేయాలని, ఫీజులను సగానికి తగ్గించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. లేనియెడల పేద మధ్య తరగతి ప్రజలను సమీకరించి ఫీజులు తగ్గేవరకు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము.
ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులూ వల్లెపు రాజు, నీమ్మల విజేందర్, హసీనా బేగం, యాదమ్మ, వి .రజిత సుదర్శన్, బొంత రవి, రమ, కవిత, సాంబన్న, తిరుపతి నాయక్, భాగ్యలష్మి, సుమలత, రాణి, కొమురెల్లి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.