మన ఊరు – మన బడి,మన బస్తీ -మన బడి తో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం,మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి:

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం కృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
మన ఊరు మన బడి,మన బస్తీ-మన బడి కార్యక్రమం పై ప్రజా ప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ స్థాయి స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ…..రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి,పాఠశాలలను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూర దృష్టి తో “మన ఊరు – మన బడి ,మన బస్తీ-మన బడి” కార్యక్రమాన్ని తీసుకు వచ్చినట్లు ఆయన అన్నారు . మొదటి విడతగా నియోజకవర్గంలో 83 పాఠశాలలను మౌలిక వసతులు కల్పించి పటిష్టం చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి తో రాష్ట్రం ముందుకు వెళుతోందని,విద్యా రంగం లో కూడా మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఆయన తెలిపారు.అక్కడక్కడ కొన్ని చోట్ల పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రకమైన చిన్న సమస్యలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక హంగులతో సమగ్రంగా తీర్చిదిద్దేందుకు మన ఊరు-మన బడి,మన బడి-మన బస్తీ కార్యక్రమం 3 దశలలో చేపట్టనున్నట్లు తెలిపారు.రాష్ట్రం లో ఈ కార్యక్రమానికి 3 సంవత్సరాలకు గాను రూ. 7,289 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. మొదటి విడత గా 2021-22-సంవత్సరం లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం లోని ప్రాథమిక,ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ల నుండి అధిక నమోదు కలిగిన 9123 (35 శాతం) ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కు 3497 కోట్ల 62 లక్షల రూపాయలు కోట్ల ఖర్చు తో మరింత మెరుగు పరచే బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి వాటి స్థానంలో కొత్త గదులను నిర్మించడం, ప్రహారీ గోడలు, కిచెన్‌ షెడ్లు, హై స్కూల్లో డైనింగ్‌ హాల్ నిర్మాణాలు చేపట్టడం, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సౌకర్యం తో టాయిలెట్ ల నిర్మాణాలు, భవనాలకు రంగులు వేయడం, మరమ్మతులు చేయడం, కావాల్సిన ఫర్నీచర్‌ ఏర్పాటు, గ్రీన్‌ చాక్‌బోర్డులు,విద్యుద్దీకరణ, డిజిటల్‌ పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి మండలంలో 2021-22 విద్యా సంవత్స రానికి 35 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయనున్నామని అన్నారు. ఆయా మండలాలు, పట్టణాల్లో అత్యధిక మంది విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయానున్నామని, దీనికోసం పనులు చేసేందుకు గాను ఒక మండలానికి ఒకే ఏజేన్సీని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలల్లో గుర్తించిన పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రణాళికలు సిద్దం అయిన తర్వాత చేపట్టాల్సిన పనులు ప్రారంభం అయిన తర్వాత తాను స్వయంగా ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ రెండు చొప్పున బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉంటుందని, ఒక ఖాతాలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులను పాఠశాల నిర్వహణకు అవసరమగు ఖర్చులకు జమ చేయాలని, మరొక ఖాతాలో ప్రజలు, పూర్వ విద్యార్థులు, విద్యాభిమానులు, దాతలు తదితరులు ఇచ్చే విరాళల సొమ్మును జమచేయాలన్నారు. ఈ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచి మరిన్ని విరాళాలను ప్రోత్సహించాలన్నారు. ఎవరైనా దాత రూ. 2 లక్షలు ఇస్తే పాఠశాల కమిటీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చని, రూ. 10 లక్షలు అంతకు ఎక్కువ విరాళం ఇస్తే పాఠశాలలో ఒక తరగతి గదికి దాత పేరు లేదా దాత సూచించిన పేరు పెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజలను, ఎన్‌ఆర్‌ఐలు, పూర్వవిద్యార్థులను భాగస్వాములను చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చింతా కవిత రెడ్డి,చుండూరి వెంకటేశ్వరరావు, జెడ్పిటిసిలు కృష్ణకుమారి,పుల్లారావు, కొనతం ఉమ,బొలిశెట్టి శిరీష, వైస్ ఎంపీపీ రాణి, ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు సలీం షరీఫ్,గోపాల్ రావు, ఇంజనీరింగ్ అధికారులు డి ఈ రమేష్ బాబు ఏ ఈలు రాము,ఓబులేష్, మధుకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.