ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు

ఈ రోజు ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామ శివారులో గల పోడు భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కొట్టుతుండగా రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరిగింది
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 30 యేండ్ల నుండి సాగు చేసుకున్న భూములను ఫారెస్ట్ అధికారులు హరిత హరం పేరుతో పోడు భూముల చుట్టూ స్ట్రెంచ్ కొడుతూ బయబ్రంతులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు కోరారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం,గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకన్న,ఉప సర్పంచ్ శ్రీనివాస్,రైతులు మహిళ రైతులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.