ఫిబ్రవరి 12 నుండి సింగరేణిలో జేఏసి తల పెటిన కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె

20 22 ఫిబ్రవరి 12 నుండి సింగరేణిలో జేఏసి తల పెటిన కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ధైర్యంగా సమ్మెలో పాల్గొని హక్కులను సాధించుకోవాలి .సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి
బంధు సాయిలు పిలుపు
20 22 ఫిబ్రవరి 12 నుండి ఇ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొని సమస్యను పరిష్కరించుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సి పి ఐ ఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కార్యదర్శి కామ్రేడ్ బందు స్థాయిలు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. వేతనాలు పెరగక ,కార్మిక చట్టాలు, చట్టబద్ధ సౌకర్యాలు రాక అనేక రకాలుగా చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి లో ఉండే కాంట్రాక్టు కార్మిక సంఘాలు అన్ని ఐక్యమై జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 12నుంచి నిరవధిక సమ్మె తలపెట్టడం సిపిఎం పార్టీ అభినందిస్తూ ఉంది.
నేడు కాంట్రాక్ట్ కార్మికుల మీద ఉన్న కర్తవ్యం నిరవధిక సమ్మెలో పాల్గొని హక్కులను సాధించుకోవాలి. కొత్త జీవోల ప్రకారం అను స్క్రిప్ట్ వర్క్ 736 రూపాయలు semi skilled వర్కు 884 రూపాయలు స్క్రిప్టు వర్కు ₹999 హై స్కూల్ వర్క్ 1128 నుండి 1589 వరకు ఓల్వా డ్రైవర్ లో ఆపరేటర్లకు 37 వేల 462 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ పాత జీతాలు చెల్లించడం కాంట్రాక్ట్ కార్మికులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలకు సింగరేణి యాజమాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు కారణం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి గారు ఆ పని చేయడం లేదు. కనీసం వేతనాలు పెరుగుదలకు కృషి చేయటం లేదు. కోల్బెల్ట్ పర్యటన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి నాయకులు మరియు టిఆర్ఎస్ నాయకులు కాంట్రాక్ట్ కార్మికులు వాడుకోవడం తప్ప సమస్య పరిష్కారానికి దారి చూపడం లేదు. ఈరోజు వరకు బొగ్గు మంత్రి గాని, ఆ శాఖ అధికారులు గాని సింగరేణిలో కేంద్రం తరఫున ఉన్న డైరెక్టర్ గాని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సింగరేణి ఆదేశాలు ఇవ్వడం లేదు. మంత్రులు ,ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. కాంట్రాక్ట్ కార్మికులకు మేలు చేస్తామని ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ కార్మికుల బతుకులను తాకట్టు పెట్టి సింగరేణి వద్ద వివిధ పేర్లతో కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు తప్ప కాంట్రాక్ట్ కార్మికులకు చేసిందేమీ లేదు. ఇటీవల సింగరేణి రక్షణ కోసం పోరాడతామని ప్రకటనలు ఇస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలి. చనిపోయిన కార్మికులకు ఎమ్మెల్యేలు ఒప్పందాలు అమలు కావడం లేదు .కాంట్రాక్ట్ కార్మికుల పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా బిజెపి ,టిఆర్ఎస్ ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అందుకే అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు అంతా ఫిబ్రవరి నుండి జరుగుతున్న నిరవధిక సమ్మెలో పాల్గొని తాడోపేడో తేల్చుకోవాలి. ఇది ఎవరి కోసమో జరుగుతున్న సమ్మె కాదు. కాంట్రాక్ట్ కార్మికుల బతుకు కోసం, జీవితం కోసం జీతాల పెరుగుదల కోసం, చట్టాల అమలు కోసం, చట్టబద్ధ సౌకర్యాల కోసం, సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ నెల 12 నుండి తలపెట్టిన నిరవధిక సమ్మె సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అందరూ పనులు బంద్ చేసి కోల్ ఇండియా వేతనాలు అమలయ్యే వరకు, నిరవధిక సమ్మెలో పాల్గొనాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సిపిఎం, ఎర్ర జెండా అండగా ఉంటూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.