మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన గిరిజన బాలికల వసతి గృహంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 36 మంది విద్యార్థినులు అవస్థతకు గురై స్థానిక ఏరియా ఆసుపత్రిలో 11మంది విద్యార్థినులు చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు నేరుగా హాస్పిటల్ వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.అనంతరం వారికి ఫ్రూట్స్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లను అందజేశారు. అనంతరం బలరాం నాయక్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత,గిరిజన ఆశ్రమ,వసతి గృహాలలో పరిశుభ్రత పాటించడంతో పాటుగా పిల్లల ఆరోగ్య విషయంలో తనిఖీలు, ముందు జాగ్రత్తలు లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మధ్య కాలం లో బాసర ఐఐటీ లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఒక విద్యార్థి చనిపోయాడని ఈ చావుకు కారణం ఎవరంటూ ప్రశ్నించారు.మొన్నటికి మొన్న గూడూరు లో కూడా గిరిజన బాలుర వసతి గృహంలో కూడా ఇదే పరిస్థితి మరియు నిన్న మహబూబాబాద్ లో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అని తెలిపారు.విద్యార్థినులను వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాళ్లకు సరైన సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని…స్థానిక ఎమ్మెల్యే, ఎంపి,మంత్రి గిరిజనలు ఉండగా కూడా ఇలాంటి సమస్యలను పట్టించుకోకుండా నిద్రపోతున్నారని అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆశ్రమ, వసతి గృహాలు కమీషన్ల మీద నడుస్తున్నాయని…విద్యార్థినులు చెప్పిన సమస్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి,ముఖ్యంగా మహబూబాబాద్ గిరిజన,ఆశ్రమ వసతి గృహాలలో పర్యటించి ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. హాస్టళ్లలో సరైన వసతులు లేక విద్యార్థినులు కన్నీరు పెట్టుకుంటూ వారి సమస్యలు వింటూ కన్నీరు పెట్టిన బలరాం నాయక్ .వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు,ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుగులోత్ వెంకట్ నాయక్, జిల్లా అధ్యక్షుడు రియాజ్ అన్సారీ,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ నాయక్,యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ రిజ్వాన్,అరుణ్ నాయక్,షబ్బీర్, సలీం,సురేష్ తదితరులు ఉన్నారు….

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.