బంజారాలు సేవాలాల్ మహారాజ్ ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండా గ్రామం లో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని రేగొండ మండలం రామన్నగూడెం తండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామిడి సతీష్ రెడ్డి అన్నారు.సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి వేడుకలు రామన్నగూడెం తండా పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ అహింసా సిద్ధాంతాన్ని కాకుండా సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి సన్మార్గంలో నడవడానికి కృషి చేశారని, వారి బోధనలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు. గిరిజన మోర్చా జిల్లా నాయకులు రాజేందర్ నాయక్ మాట్లాడుతూ బంజారాలు సేవాలాల్ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి ని అధికారికంగా నిర్వహించాలని పాఠ్యపుస్తకాలలో వారి జీవిత చరిత్ర పొందు పరచాలని అన్నారు. తదనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నవీన్, అంగన్వాడి టీచర్ సరస్వతి, ఉపాధ్యాయులు కుసుమ వెంకటేశ్వర్లు, వినోద్, మణికంఠ, రాకేష్, యాకు, వినోద్, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.