బడుగుల పది కాలాల పాటు చల్లగా వుండాలి

పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ పది కాలాలపాటు చల్లగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టాకిషోర్, టీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణలు అన్నారు. రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక వివేకానంద వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసి కేక్ కట్ చేశారు . వివేకానంద వృద్ధాశ్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటు, భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,మాకట్ లాల్, ధండు రేణుక, టిఆర్ఎస్ పార్టీ మహిళ కార్యదర్శి మహేశ్వరి,లక్ష్మీకాంత్ రెడ్డి, శనగాని అంజమ్మ, రామంగిరి నగేష్, తదితరుల పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.