బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి మొండిచెయ్యి -ఆవాజ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి మొండిచెయ్యి చూపించింది. 2లక్షల 56 వేల కోట్ల బడ్జెట్ లో మైనారిటీ సంక్షేమానికి కేవలం1728 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్ కమీషన్ నివేదిక సిఫార్సులను తానే అమలు చేయడం లేదు. అంచనాలను సవరించి 5వేల కోట్లు కేటాయించాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

మైనారిటీ సంక్షేమానికి గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ లో కేటాయింపులు పెంచలేదు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లకు 7 కోట్ల కోత విధించారు. పేద విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది.  మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ కు కేటాయింపులు పెంచలేదు. లక్షల మంది యువతీ, యువకులు, చిరు వ్యాపారులు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు నిధులు పెంచలేదు.  మల్టీ సెక్టోరల్ అభివృద్ధి ఫండ్ కు కోత విధించారు. గత ఐదేళ్లుగా అభివృద్ధి కోసం కేటాయింపులు పెంచలేదు. కెసిఆర్ ప్రభుత్వం మైనారిటీలకు తీయటి మాటలు చెబుతూ  బడ్జెట్ కేటాయింపుల్లో తీరని అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మైనారిటీ సంక్షేమానికి 5వేల కోట్లు కేటాయించి, మైనారిటీ బంధు పథకం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.