బడ్జెట్లో రజకులకు అధిక నిధులు కేటాయించాలి

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు, అదనపు జిల్లా కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారికి *మరియు *బిసి అభివృద్ధి అధికారి జి.ఆశన్న గార్లకు వినతి పత్రాలు* సమర్పించడం జరిగింది. డిమాండ్స్ బడ్జెట్లో రజకులకు అధిక నిధులు కేటాయింపు-(2) రజక వృత్తిదారుల అందరికీ 5 లక్షలతో భీమా ఏర్పాటు చెయ్యాలని(,3) ఉచిత విద్యుత్ పథకాన్ని ఎల్టిటి నుండి lt4 కి మార్చాలి (4) ప్రభుత్వ దవాఖానాలు విద్యాసంస్థలు పోలీస్ శాఖలో తదితర బట్టలు ఉతకడం.ఇస్త్రీ చేయడం లాంటి పనులు . రజక వృత్తిదారుల సొసైటీలకు ఇవ్వాలి(.5) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా రక్షణ చట్టం చేయాలి.(6) వీరనారి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి.( 7) రజక ఫెడరేషన్ కు పాలకవర్గాన్ని నియమించాలి.(8) రజక వృత్తిదారుల అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి (9) జీవో నెంబర్ 27 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులు పోలీస్ శాఖలో ధోబి పోస్టులు భర్తీ చేయాలి.(10) రజకుల ఆత్మగౌరవ భవనం పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తేవాలి, .11) ఉచిత విద్యుత్తు లబ్ధిదారులకు ఇస్త్రీ పెట్టె టేబుల్ ప్రభుత్వమే ఉచితంగా అందించాలి .12) 50 సంవత్సరాలు దాటిన ప్రతి వృత్తిదారులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మరియు సౌత్ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో ఉమ్మడిగా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నరేష్ సౌత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం బాలకృష్ణ, సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు చారగొండ వెంకటస్వామి సౌత్ జిల్లా అధ్యక్షులు శ్రీ రాములు సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు మరియాల గోపాల్, సెంట్రల్ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ నాగేశ్ . సెంట్రల్ జిల్లా లొంక సోమయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.