బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి 5శాతం నిధులు కేటాయించాలి

ఆత్మగౌరవం, హక్కులసాధన లక్ష్యంగా 2010 ఫిబ్రవరి 21, 22తేదీలలో కలకత్తాలో NPRD స్థాపించబడి, అనేక పోరాటాలు నిర్వహించి 2016 వికలాంగుల పరిరక్షణ చట్టాన్ని సాధించిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (Nprd) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.ఆడవయ్య తెలిపారు.

దివి: 17-02-2021బుధవారం రోజున సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బిట్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా సంఘం దశాబ్ది వేడుకలలో భాగంగా జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు చేతుల మీదుగా సంఘం జెండా ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14 నుండి 21 వరకు జరిగే సంఘం దశాబ్ది వేడుకలలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో జరిగే వేడుకలకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.ఆడవయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఉన్న వికలాంగులలో కేవలం 4 లక్షల మందికే ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. మరో 2 లక్షల మందికి పైగా వికలాంగులు ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత కలిగి ఉన్నపటికీ పెన్షన్లు రావడం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు అందించే కార్పొరేషన్ రుణాలు మండలానికి ఒక యూనిట్ చొప్పున ఇవ్వడం దుర్మార్గం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం ఆలోచిస్తే ఈ సంఖ్యను ప్రతి మండలానికి 20 యూనిట్ల చొప్పున లేదా ప్రతి జిల్లాకు ఒక కోటి రూపాయలు స్వయం ఉపాధి రుణాల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. Nprd రైల్వేలో సౌకర్యాల కోసం, దేశ వ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానానికై, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, విద్య, ఉద్యోగ, ఉపాధిలలో రిజర్వేషన్ల సాధనకై నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ నెల 22న బాగ్లింగంపల్లిలోని సుందరయ్య భవన్లో Nprd సంఘం దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకలకు వికలాంగులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బండవరం శ్రీదేవి, భూమా రజిత, ఉప్పరి వేణు, మాలోతు రాజ్ కుమార్, మామిడాల రాజేశ్వరి, జిల్లా సహాయ కార్యదర్శులు ఆకారపు కుమార్, మోతే వెంకటమ్మ, జిల్లా కమిటీ సభ్యులు రావుల శ్రీనివాస్, పులి మంజుల, వాతాల యాదగిరి, కామరాతి వినయ్, నాచు అరుణ, బండ్రు శ్రీశైలం, అంబాల మహేష్, గోదల ఐలయ్య, G.ఐలయ్య, బుర్రి జానకి, అనపర్తి మధు, అనపర్తి స్వర్ణ, శివప్రసాద్, గద్దల మైసయ్య, A.అనిత, లతోపాటు వివిధ మండలాల నుండి వికలాంగులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.