#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న తెరాస. మరో పోరాటానికి సిద్ధమైంది విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈరోజు బయ్యారంలో దీక్ష చేపట్టింది బయ్యారంలో ఉక్కు పరిశ్రమ అంశంపై కేంద్రం బృందాలు బయ్యారంలో పలు మార్లు సర్వే చేశాయి. పరిశ్రమ ఏర్పాటుకు స్థలం, ఇనుప రాయి గుట్ట, నీటి లభ్యత, రైల్వేలైన్, విద్యుత్ సదుపాయం తదితర అంశాలను పరిశీలించాయి. ఈ సర్వేల అనంతరం ఇనుపరాయి నాణ్యత సరిగా లేదంటూ కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం చేతులెత్తేసింది. తాజాగా బయ్యారం ఉక్కు పరిశ్రమ రాదంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో తెరాస నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి, విభజన చట్టంలో పొందుపరిచి మరీ కేంద్రం పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంపై చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తూ వస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పైప్‌లైన్‌ ద్వారా ముడి ఇనుము సరఫరా చేసినా ఖర్చు భరిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు స్పష్టం చేశారని తెరాస చెబుతోంది కర్మాగారం కోసం ప్రయత్నించకుండా ఇక రాదని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పడం దారుణమని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, టిఆర్ఎస్ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత విమర్శించారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఇప్పటికే పలుమార్లు రిలే నిరాహార దీక్షలు, చలో కలెక్టరేట్ తదితర కార్యక్రమాలను చేపట్టగాఇవాళ ఒకరోజు దీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు నినాదంతో రాష్ట్రమంత్రులు, తెరాస ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలుపెద్ద ఎత్తున దీక్షలో పాల్గొననున్నట్లు టిఆర్ఎస్ జిల్లాపార్టీ అద్యక్షురాలుమాలోత్ కవితతెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.