బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు

బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని వెంటనే ప్రారంభించాలి

మిత్ర పక్షాల ఆధ్వర్యంలో చిన్న గూడూరు మహబూబాబాద్ రహదారిపై ధర్నా

తాహాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించిన కాంగ్రెస్,మిత్రపక్షాల నేతలు

డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గునిగంటి కమలాకర్

మహబూబాబాద్ జిల్లా

రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ మరియూ సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో చిన్న గూడూరు మండల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాద్ జిల్లా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం చిన్న గూడూరు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి అనంతరం తహసిల్దార్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గునిగంటి కమలాకర్ మాట్లాడుతూ సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని యువతరానికి ఆశ చూపి రెండోసారి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లు అవుతున్న బయ్యారం ఉక్కు కర్మాగారం ప్రారంభించలేదని మోసపూరిత వాగ్దానాలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువకుల జీవితాలతో చలగాటం అట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ప్రారంభించడం వల్ల మహబూబాద్ జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పాలకులు అవకాశవాద రాజకీయాలకు పాల్పడు ఈ జిల్లా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జిల్లాను పరిపాలిస్తున్న ప్రజా ప్రతినిధులు కళ్లు తెరవాలని “చిత్తం శివుని మీద – భక్తి ఎవరిమీ దో అన్నట్లుగా పాలకుల వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లా అధికారుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లే విధంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిన్న గూడూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భత్తెమ్ రమేష్,చిన్నగూడూర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మారబోయిన వెంకటేశ్వర్లు,చిన్న గూడూరు మండల పార్టీ ఉపాధ్యక్షులు నూకల రాజేందర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వడ్లకొండ ఆదాం,కార్యదర్శులు కిరణ్, సుధాకర్,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్యా వెంకన్న,ప్రధాన కార్యదర్శి భానోత్ రవి,మంగోలిగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలయ్య,మరియూ కాంగెస్ నాయకులు నిరంజన్,శంకర్,రవి,జాటోత్ రవి,ధారవత్ మోహన్ నాయక్,దాసరి శ్రీనివాస్,
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.