97-98 బ్యాచ్ క్లాస్ మెంట్ మిత్రులందరు కలిసి పరామర్శించి తమ వంతు సహకారము

E69news :-జాఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో ఇటీవలి కాలంలో లో బత్తిని రాజయ్య మరణించిన విషయం విదితమే.కాగా రాజయ్య కుమారుడు రాజు చిన్న నాటి మిత్రులు 97-98 బ్యాచ్ క్లాస్ మెంట్ మిత్రులందరు కలిసి పరామర్శించి తమ వంతు సహకారముగా 1క్వింటా బియ్యం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్యనిర్వహణ కార్యదర్శి ఆమంచ మురళి మాట్లాడుతూ:-మా క్లాస్ మెంట్ మిత్రులకు ఎలాంటి ఆపద వచ్చినా మేము సైతం మీ తోడుగా అండగా ఉంటామని గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామని ఈ పరంపర ఎల్లవేళలా కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గోనె వెంకటేశ్వర్లు బక్కం కరుణాకర్ రాపర్తి అశోక్ శంకర్ పొన్నాల నాగయ్య వలీపాష శోభన్ బాబు రఫీ సలీం ప్రసన్న బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

Leave a Reply

Your email address will not be published.