పరకాల నియోజకవర్గ వరంగల్ రూరల్ జిల్లా ఒగ్లాపూర్ సైలాని బాబా దర్గా గంధం జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం
దామెర మండలంలోని ఒగ్లాపూర్ లోని సైలానిబాబా దర్గా లో ఏప్రిల్ 2 నుంచి నిర్వహించనున్న గంధం జాతర నిర్వహణ పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిచిన పరకాల ఇంఛార్జి ఆర్డీఓ మహేందర్ జీ
హాజరైన వివిధ శాఖల అధికారులు. ఈ సందర్భంగా గా ఆర్డిఓ మహేందర్ జీ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. కరోనా నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎంపీపీ కాగితాల శంకర్, తాసిల్దార్ రియాజుద్దీన్, ఎస్ఐ భాస్కర్ రెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష, విద్యుత్ శాఖ ఏఈ శిరీష్ కుమార్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ,అధికారులు పాల్గొన్నారు.