బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి

స్వాతంత్ర్య సమరయోధుడు భారత దేశపు తొలి దళిత ఉప ప్రధాని గొప్ప సంఘసంస్కర్త మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి నివాళులర్పించిన దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ వారుఈ నివాళులర్పనలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి ఎం.సి సుంకన్న గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నా పామిడి మండలం సీఐ శ్యామ్ రావు బి ఎస్ పి.నాయకులు మల్లికార్జున వీరు పాల్గొని మాట్లాడుతూ.
గాంధీజీ చేత అమూల్య రత్నగా పిలువబడ్డ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక వివక్ష, అసమానతలు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం కృషిచేశారు అంటూ స్మరిస్తూ కొనియాడుతూ ఆ ఆదర్శమూర్తి స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం పోరాడుదాం అని తెలియజేశారు
ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం కార్యకర్తలు వై ఎస్ ఆర్ సి పి నాయకులు సిపిఐ తెలుగుదేశం సిపిఎం నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.