బాలబాలికల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఉ 11-00 గంటలకు శ్రీమతి పుణ్యం లక్ష్మి అధ్యక్షురాలు మండల ప్రజాపరిషత్ రేగొండ అధ్యక్షతన మండల బాలబాలికల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయుటకు గాను సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది,ఈ సమావేశమునకు జి.సురేందర్,సెక్రటరీగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి రేగొండ , కుమార్,జిల్లా బాలికల పరిరక్షణ కమిటీ కన్వీనర్, నీహారిక, వైద్యాధికారి సభ్యులు గా , సి డి పి ఓ అవంతి , సభ్యులు గా ఎస్ ఐ రేగొండ, సభ్యులు గా వినోద, లేబర్ అదికారి, సభ్యులు గా మండల సమైక్య అధ్యక్షులు, సభ్యులు గా ఎన్జీవోస్ యూత్ సభ్యులు, సభ్యులు గా నిషిధర్ రెడ్డి, చైర్మన్ రేగొండ గ్రామ బాలికల పరిరక్షణ కమిటీ మరియు శ్రీనివాస్, చైర్మన్, దమ్మన్నపేట గ్రామ బాలికల పరిరక్షణ కమిటీ సభ్యులు గా హజరై నారు.ఈ కమిటీ 0నుండి 18 సంవత్సరం వయసు కలిగిన బాల బాలికల పై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించుట, అక్రమ దత్తతలను అరికట్టుట, బాల్య వివాహాలు నిరోదించుట , బాలికల పై జరుగుతున్న వేదింపులను పోలిస్ వారి సహయంతో అరికట్టుట మెదలగు పనులను గ్రామ బాలికల పరిరక్షణ కమిటీ సహాయం తో నిర్వహిస్తారు,అధ్యక్షులు మాట్లాడుతూ బాల్యవివాహాలు జరుగకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని, మీకు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబరు 1098 ఫోన్ చేసి తెలియచేసినచో మీ యెక్క వివరములు కూడ రహస్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.