టిఆర్ఎస్ & బిజేపి పార్టీలు అధికారం లోకి రావడం కల్ల.. అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు బాలవికాసలో నవసంకల్ప్ శివిర్ కార్యక్రమంలో నాయిని..
ఏఐసిసి, టీపీసీసీ స్థాయిలో జరిగిన నవ సంకల్ప మేధోమదన శిబిరం జిల్లా స్థాయిలో కూడా ఒక రోజు జరపాలన్న పిసిసి నిర్ణయం మేరకు.నేడు 16వ తేదీన బాలవికాస కేంద్రం లో ఫాతిమా నగర్ బ్రిడ్జి దగ్గర హన్మకొండ & వరంగల్ జిల్లాలకు సంబదించిన నవసంకల్ప మేధోమధన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శివిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి & మాజీ మంత్రివర్యులు సంభాని చంద్ర శేఖర్ పాల్గొన్నారు.
ఈ నవసంకల్ప్ శివిర్ లో ప్రధానంగా 6 గ్రూప్లుగా విభజించి 1.పొలిటికల్ 2 అగ్రికల్చర్ 3. ఎకానమీ 4. సోషల్ జస్టిస్ 5. ఆర్గనైజేషన్ 6 యూత్ గ్రూప్లపై వాటిపై విశ్లేషణలు సూచనలు వక్తల ఉపన్యాసాలు తీసుకొని తీర్మానాలు చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బాలవికాస సెంట్రల్ హాల్ జ్యోతి ప్రజ్వలన చేసి నవ సంకల్ప్ శివిర్ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసంలో నవ సంకల్ప్ శివిర్ కమిటీ చైర్మన్ నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
దేశానికి గాంధి కుటుంబం చేసినటువంటి సేవలు మరిచి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా బిజేపి పార్టీ కుత్రపూర్తింగా బురద జల్లుతూ సోషల్ మీడియా మాధ్యామాల ద్వారా అసత్య ప్రచారం చేస్తోంది.
బిజేపి ప్రజలకు చెప్పుకోవడానికి చేసింది ఏమిలేదు అందుకే ఈ విధంగా గాంధి కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తన్నారు.
గాంధీ కంటే గాడ్సే గొప్పోడు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రామ మందిరం, లేక పోతే సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం ఇవి తప్ప వారికి చెప్పుకోవడానికి ఇంకా ఏమి లేదు.
కులాలను మతాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవడం తప్ప వారు చేసింది ఏమి లేదు.
బిజేపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డీమోనిటైజేషన్, జి.ఎస్.టి రైతు వ్యతిరేక చట్టాలు లాంటి వలన ప్రజలకు లాభం ఏమి ఉండదని ప్రజలు విస్మరించారు.
కాంగ్రెస్ పార్టీ లాగ ఆర్ఈసి కట్టినం, కేయుసి కట్టినం, కేఎంసి కట్టినం సెంట్రల్ జైలు కట్టినం అని చెప్పుకోవడానికి వారు ఏం చేయలేదు కాబట్టి వారికి మొఖాలు లేవు.
గాంధీ కుటుంబం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే గాంధి కుటుంబం. అందుకే ఎప్పుడు గాంధీ కుటుంబంపై కుట్రలు చేస్తుంది.
ఈ రోజు గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది. జవహర్లాల్ నెహ్రు అయితే నేమి, ఇందిరా గాంధీ నయితే నేమి,
ఈ నవ సంకల్ప్ శివిర్ ద్వారా క్రమశిక్షణ, ఆలోచన, సూచనలను, సలహాలను పాటించి తీర్మానాలు చేస్దాం
కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని భవిష్యత్ తరాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తలచుకోవాలి
ఈ రోజు గ్రామంలో ఇందిరమ్మ లేని గ్రామం ఉందా చెప్పండి. ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు అని.
కనీసం మండలం ఒక డబల్ బెడ్ రూమ్ కట్టిందా? ఈ టి.ఆర్.ఎస్. ప్రభుత్వం. కేవలం అధికారంలోకి రావడానికి పార్టీలు ప్రజలను మభ్య పెట్టి హామీలు గుప్పిస్తున్నారు.
అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కుతున్నారు.
టిఆర్ఎస్ & బిజేపి పార్టీలు అధికారం లోకి రావడం కల్ల.. అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
ఇంకా మంకు ఒకటే సంవత్సరం ఉంది కాబట్టి పార్టీ నిర్మాణం చేపట్టాలి.
కలిసి కట్టుగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కంకణ బద్దులు కావాలని అన్నారు.
జిల్లా ఇంచార్జి & మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్ మాట్లాడుతూ….
కాంగ్రెస్ పార్టీ చరిత్రను, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను పక్కకు పెట్టె విధంగా భావి భారత పౌరులకు తెలియ చేయకుండా ఉండటానికి ఒక దురుద్దేశంతో ఒక మతతత్వ పార్టీ అయిన బిజేపి దేశంలో కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతీయత పేరుతో వర్గీకరించి దేశ సమగ్రతకు భంగం వాటిల్ల జేస్తుంది.
భావిష్యత్తులో మహాత్మా గాంధీ లాంటి మహనీయుల చరిత్ర ఇక పాట్యాం శాలలో ఉండవు, ఇకపై కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మలు తీసేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ అంటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటాం అదే బిజేపి పార్టీకి హిందూ ముస్లిం కలిసి ఉండటం నచ్చాడు.
ఇందిరా గాంధీ దేశ సమగ్రత గురించి తన ప్రాణాలు విడిచింది.
రాజీవ్ గాంధీ గారు దేశంలో ఉగ్ర వాదులను అరి కట్టే క్రమంలో తన ప్రాణాలు విడిచారు.
అలాంటి మహానీయులపై ఇవాళ బిజేపి ప్రభుత్వం బురదజల్లుతుంది.
రెండు సార్లు ప్రధాన మంత్రిగా అవకాశం వచ్చిన కూడా సోనియా గాంధీ గారు ప్రధాన మంత్రి పదవి చేపట్ట కుండ తరుణ ప్రాయంగా వదిలి వేసినటువంటి మహనీయులు అలాంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
బిజేపి ప్రభుత్వం ఈ రోజు మూడో రోజు కూడా ఈ.డి. సి.బి.ఐ. సంస్థలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని విచారణ పేరుతో రాహుల్ గాంధీ గారిని ప్రియాంకా గాంధీ గారిని పిలిచి విచారణ చేస్తున్నారు.
మీరు గుర్తించాలే ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యాకే దళితులకు, గిరిజనులుకు, బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది.
గరీబీ హటావో నినాదంతో పేద ప్రజలకు సౌకర్యాలు కల్పించి కాంగ్రెస్ పార్టీ.
ఇంతకు ముందు ఏ ప్రభుత్వాలు కూడా ఇవేమీ పట్టించుకోలేదు.
ఈ రెండు ప్రభుత్వాలు కూడా దేశ సంపదను చరిత్రను కొల్లగోట్టేన్దుకే వచ్చాయి తప్ప ప్రజలకు సేవ చేసేందుకు రాలేదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు నిత్యావసర వస్తువులు అయిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మధ్య తరగతి సాధారణ ప్రజల నడ్డి విరుస్తున్నాయి
అంటేనే మీరు ఆలోచించవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సేవ చేస్తున్నాయో అర్థం చేసుకోవాలని అన్నారు.
హన్మకొండ & వరంగల్ నవ సంకల్ప్ శివిర్ నందు గ్రూప్ లా వారిగా చర్చిచించిన అంశాలు
పొలిటికల్ గ్రూప్/రాజకీయ గ్రూప్ :-
- పార్టీ సిద్ధాంతాలు, పార్టీ నాయకుల త్యాగాలు
- రాజ్యాంగ లక్ష్యాలు
- పార్టీ వ్యూహాలు
- పార్టీ సిద్ధాంతల్లో నూతన ఆలోచనలు ఏమి చేయాలి
- ఏఏ నూతన సిద్ధాంతాల వల్ల పార్టీ బలోపేతం అవుతుంది సలహాలు సూచనలు
ఆర్గనైజేషన్ గ్రూప్/వ్యవస్థాగత గ్రూప్ :-
- పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి మరియు పార్టీ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రతలు
- నూతన వ్యక్తులను ఎలా చేర్చుకోవాలి
- సభ్యత్వం (పార్టీ సభ్యత్వ నమోదు) ఎలా పెంచాలి
- ఒటర్లను ఎలా ఆకర్షించాలి
- పార్టీలోకి ప్రజలను ఎలా చేర్చాలి
ఎకానమీ గ్రూప్:-
- భారతదేశ ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయి
- స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆర్థిక పురోగతిపై చర్చ
- ప్రస్తుత మోడీ పాలనా కేసిఆర్ పాలనలో ఆర్థికంగా దేశాన్ని రాష్ట్రాన్ని ఎలా నష్టం చేస్తున్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి ఎలా తెసుకేల్లాలి.
- కాంగ్రెస్ పార్టీ నూతన ఆర్ధిక ప్రణాళిక ఏమిటి
అగ్రికల్చర్ గ్రూప్/వ్యవసాయం గ్రూప్:-
- వ్యవసాయ దేశమైన భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏమిటి
- మోడి కేసిఆర్ ల విధి విధానాల వలన దేశం ఏ రకంగా నష్ట పోయింది
- వరంగల్ డిక్లరేషన్ ఎం చెబుతుంది
- ఈ డిక్లరేషన్ ను మనం రైతులు కూలీలు గ్రామీణ వృత్తి దారులకు ఎలా చెప్పాలి?
సోషల్ జస్టిస్ గ్రూప్/సామాజిక న్యాయం:-
- భారత రాజ్యాగంలో సామాజిక న్యాయం ఎలా పేర్కొన బడినది ?
- కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల ప్రజలను ఎలా చేర్చుకోవాలి ?
- ఎస్.సి, ఎస్.టి, బీసి, మైనారిటీ మరియు మహిళలు అగ్ర కుల పేదలకు కాంగ్రెస్ పార్టీ ఎలా న్యాయం చేయాలి?
యూత్ గ్రూప్/యువత గ్రూప్:-
- యువతకు రాజకీయాల లక్ష్యాలు ఎందుకు ఉండాలి?
- కాంగ్రెస్ పార్టీ యువతను ఎలా ఆకర్షించాలి? మరియు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలి?
- యువత నాయకత్వాన్ని ఎలా పెంచాలి?
- యూత్ కాంగ్రెస్ మరియు NSUI-కాంగ్రెస్ పార్టీ మధ్య సమన్వయము ఎలా ఉండాలి. అనే అంశాలపై చర్చించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రాం రెడ్డి, వరంగల్ ఎం.పి.గా పోటి చేసిన అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు నమిండ్ల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వరద రాజేశ్వర్ రావు, నల్గొండ రమేష్, టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ రియాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐసిసి & టిపిసిసి నాయకులు & అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు, జిల్లా అనుబంధ సంఘాల అద్యక్షులు, కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మండల కో-ఆర్డినేటర్లు, ఎంపిటిసిలు, సర్పంచ్లు పిఏసి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.