బాసర బాధిత విద్యార్థుల కుటుంబాలను పరామర్శించిన బీఎస్పీ నేతలు

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కు గురై వందలమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాసర విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బాసర విద్యార్థుల కుటుంబాలను కలసి
వారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఇచ్చిన పిలుపు మేరకు కోదాడ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న కోదాడ ప్రాంతానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని పరామర్శించి,
మనో ధైర్యాన్ని కల్పించారు.పిల్లల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకుని ఓదార్చారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ మాట్లాడుతూ ఏం క్షణం ఏం జరుగుతుందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం విద్య వ్యవస్థపై సవితి తల్లి ప్రేమ చూపుతూ
భావి తరానికి బతుకు లేకుండా చేస్తుందని
మండిపడ్డారు.గత కొన్ని రోజుల క్రితం విద్యార్థులు చేసిన ఉద్యమానికి తలొగ్గిన ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ఆహారం కల్పిస్తామని నమ్మబలికి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో ప్రభుత్వం మీద విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం పోయిందని తెలిపారు. విద్యార్ధులు ఉద్యమం చేస్తున్నప్పుడు యూనివర్సిటీని సందర్శించి సిల్లీ సమస్యలంటూ సింపుల్ గా కొట్టిపారేసి,ఈ రోజు ఈ సంఘటనకు కారణమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా కేసీఆర్ ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోశాధికారి కందుకూరి ఉపేందర్, బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు నిర్మల,ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.