బిజెపితోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం

ప్రధానమంత్రి మోడీ తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని
బిజెపి రాష్ట్ర నాయకులు గాదె రాంబాబు అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాదె రాంబాబు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్ర రావు ఆదేశాల మేరకు బూత్ కమిటీ లో భాగంగా మరిపెడ తానంచర్ల,వెంకంపాడు, చిల్లంచర్ల,ఎల్లంపేట,ఉగ్గంపల్లి,గిరిపురం గ్రామాల్లో పర్యటించడం బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలని కలవడం జరిగింది అన్నారు. బిజెపితోనే దేశ,రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల చేయాలని అన్నారు. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామని చెందిన శరణ్య మృతికి కారకుడైన లింగమల్లు ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యువతి శీలానికి వేలకట్టిన పెద్దమనుషుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి గంగాధర్, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు భూక్య సుధాకర్ నాయక్, నాయకులు జగన్,హుస్సేన్, ముడవత్ రమేష్ తదతరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.