బిజెపి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసన

సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ డీఎస్ రెడ్యానాయక్ గారు, సూచనల మేరకు బిజెపి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగాతెలంగాణ రాష్ట్రంలో యాసంగి వడ్లకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఈరోజు మరిపెడ మండల కేంద్రంలోనీ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ శ్రీ గుడిపుడి నవీన్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వరి ధాన్యన్ని కొనుగోలు చేయాలని మరిపెడ ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు గారు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సర్పంచులు,ఎంపీటీసీ సభ్యుల సమక్షంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శారద రవీందర్ గారు, వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి,సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు తళ్ళపల్లి శ్రీను,ఎంపీటీసీ ఫోరమ్ అద్యక్షులు రఘు,ఎంపిడిఓ దన్సింఘ్,mro రాంప్రసాద్ మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.