బిజెపి చేసే ధర్నాలకు ప్రజల మద్దతు లేదు రాజకీయ ఉనికి కోసమే వారి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనలు-హరిప్రసాద్

బిజెపి చేసే ధర్నాలకు ప్రజల మద్దతు లేదు రాజకీయ ఉనికి కోసమే వారి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనలు

-గుంజపడుగు హరిప్రసాద్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

బిజెపి నాయకులు ప్రభుత్వం ఏ పథకం అమలు చేయడానికి ముందుకు వచ్చి కార్యచరణ ప్రకటించిన ఇది మా గొప్పతనమే అని జబ్బుల చరుచుకోవడం తెలంగాణ బిజెపి నాయకులకు ఆనవాయితీ మారింది.

మొన్న అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు రిజర్వేషన్ అమలు చేస్తాం అని కేసీఆర్ చెప్పడంతో మరియు ఇప్పుడు నిరుద్యోగ భృతిని కూడ అతిత్వరగా ఇస్తాం అని రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ప్రకటించిన తరువాత బిజెపి వారు ఇది మా ఘనతనే అని చెప్పుకోవడం వారి రాజకీయ దివాళకోరు తనానికి నిదర్శనం.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిగా అభివృద్ధి పరుస్తున్నారు మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారు ప్రజలకు అందిస్తున్నారు.

కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధనకు టీఆర్ఎస్ పార్టీ నిర్విరామ పోరాటం చేసింది, కేసీఆర్ గారి ఉద్యమం ఫలితంగానే బిజెపి నాయకులు తెలంగాణ శాఖగా ఈరోజు వారికి పదవిలు వస్తున్నాయని మర్చిపోవద్దు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ వ్యవసాయమే దాండుగా అనే నినాదం నుండి ఈరోజు వ్యవసాయమే పండుగ అనే వరకు మార్చారు.

కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలు అమలు పరుస్తున్నారు.

ఈరోజు భారతదేశం అంతాకూడ తెలంగాణ వైపు చూస్తున్నయంటే అందుకు కారణం కేసీఆర్ గారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి పథకాల వల్ల రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య తీరడం తోపాటు రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు సరఫరా కేవలం తెలంగాణలోనే జరుగుతున్నది.

గతంలో లాగా ఇప్పుడు ఇక్కడ మోటర్లు కాలడం లాంటి సమస్యలు లేవు, ఉచిత కరంటు తోపాటు రైతులకు పెట్టుబడి సాయం, రుణమాఫీ, నాణ్యమైన విత్తనాల సరఫరా ఇలా కేసీఆర్ గారు రైతులకు ఇవ్వడం జరుగుతుంది.

అదేవిధంగా తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో, కోసం అనేక ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేశారు, దానివల్ల యువకులకు ఈరోజు వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

టీఎస్‌పీఎస్సీ ద్వారా, వివిధ శాఖల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు, ఆ ప్రక్రియ ఇంకా కూడ కొనసాగుతూనే ఉంది.

వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఐటీ, ఫార్మా కంపెనీలు నెలకొల్పుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా మార్చే ప్రయత్నాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయి.

ఇవి కనబడని బిజెపి నాయకులు తమ రాజకీయ ఉనికి కోసం ప్రతిరోజు ఒక ధర్నా కార్యక్రమానికి పిలుపు ఇస్తూ నాటకాలు ఆడుతున్నాడు కానీ ప్రజలు ఎవ్వరూ కూడ వారిని నమ్మే పరిస్థితిలో లేరని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.