బిజెపి పార్టీలో చేరిన బోయగూడెం గ్రామ యువకులు

స్టేషన్ ఘనపూర్ మండలం బోయగూడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువకులు,తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బిజెపినే అసలైన ప్రత్యామ్నాయం అని భావించి,ఈ రోజున బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ సమక్షంలో బిజెపిలో చేరారు.
మాదాసు వెంకటేష్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి,ప్రతి కార్యకర్త బిజెపి పథకాలను మరియు కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను,నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య చేస్తున్న అవినీతి పాలనను ప్రజలలోకి తీసుకెళ్లి,బిజెపి బలోపేతానికి కృషి చేయాలని కోరారు.అనంతరం గ్రామ బూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
పార్టీలో చేరిన వారిలో బోయిని సోమ నరసయ్య,బోయిని కృష్ణ మూర్తి,బోయిని సుధాకర్, బోయిని గణేష్,లింగబోయిన గణేష్, భోయిని రవి, బోయిని కుమార్,భోయిని సురేష్,బోయిని నాగరాజు,బోయిని పరశురాం,రాజు,వినయ్,ప్రణయ్,రవి,తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాస్కులఆరోగ్యం,మండల ఉపాధ్యక్షులుమూషిగుంపుల ఉపేందర్-చట్ల రాజ్ కుమార్,బిజేవైఎం మండల అధ్యక్షుడు నునావత్ రాజు నాయక్,ఎస్సీ మోర్చా మండల రడపాక ప్రదీప్,కందిమల్ల కృష్ణమూర్తి,చట్ల సత్యం,తొడుసు సమ్మయ్య,కాగితాల అశోక్,ఎదునూరి అశోక్,మోహన్ రావు,వద్దుల తిరుపతి,దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.