బిజేపీ మరియు కాంగ్రెస్ ఈరెండు పార్టీలు కుడా మోసపూరితమైన పార్టీలే ప్రజలు ఈ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరు

బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉండి ప్రజలను, రైతులను మోసం చేసిన వారేనని గతంలో రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నాట్టేటా ముంచడం కోసం బిజెపి కొత్త చాట్టలను తీసుకవచ్చింది, ఈరెండు పార్టీల మాటలను ప్రజలు కానీ, రైతులు కానీ నమ్మే పరిస్థితిలో లేరు, నిన్న కొందరు బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటిఆర్ గారిపైన టిఆర్ఎస్ పార్టీపైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు, వాటిని పూర్తిగా ఖండిస్తున్నం, కేటిఆర్ గారి గురించి మాట్లాడే ముందు మీ అర్హత ఎంటో ఒక్కసారి తెలుసుకోవాలని, కోరుతున్నాం, ఐటీ రంగంతోపాటు, పారిశ్రామికంగా, అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత మంత్రి కేటిఆర్ గారిదే, పిల్లకాకి అని మాట్లాడే నాయకులు తమ స్థాయిని తెలుసుకుని మాట్లాడితే మంచిది, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ చేసింది ఏమి లేదని, అసలు వారు చేసిన అభివృద్ధి ఎంటో ప్రజలకు వివరించాలి, ఒక పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలను అభివృద్ధివైపు, సంక్షేమం వైపు నడిపిస్తున్నారు, ముఖ్యంగా రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తున్నారు, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్టలలో ఎక్కడైనా ఉచిత కరెంటు కానీ, రైతుకు పెట్టుబడి సహాయం కానీ, రైతు భీమా కానీ మీరు ఇస్తున్నార సమాధానం చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు

ఈ రాష్ట్రంలో ఐటీ రంగంలో సమూలమైన మార్పులు చేసి తెలంగాణ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేటిఆర్ గారికే దక్కుతుందని, కేటిఆర్ గారు పారిశ్రామిక మంత్రిగా ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వచ్చిన విషయం మర్చిపోవద్దు, బిజెపి ప్రధానంగా దేవునిమీద గుళ్ళు మీద రాజకీయం చేయడం తప్ప వారికి అభివృద్ధి అనేది ధ్యాస లేదు, వారికి కేవలం మనుషులు మద్యలో విధ్వేశాలు రెచ్చగొట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసమే బిజెపి ప్రయత్నం చేస్తుంది, అందులో భాగంగానే ఈమద్యలో వారి రాష్ట్రస్థాయి అధ్యక్షుడి నుండి క్రిందస్థాయి నాయకులు వరకు నోటికి ఇష్టం వచ్చినట్లు టిఆర్ఎస్ పార్టీ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే బిజెపి నాయకులు కనీసం బయటకూడ తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఈరాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతో సంయమనంతో, ఓపికతో ఉన్నారని, టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని కూడ బిజెపి మర్చిపోకూడదని వారిని హెచ్చరిస్తున్నాం, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టేలా బిజెపి చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు అన్ని కూడ గమనిస్తున్నరాని, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు రైతులకు ఏమి చెయ్యడం చేతాకాక వారు ఇప్పుడు యాత్రలు ఎన్ని చేసిన ప్రజలు మిమ్మల్ని కూడ నమ్మే పరిస్థితిలో లేరని గ్రహించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.