ఈ జిల్లా సదస్సులో నూతన జిల్లా కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది

జిల్లా అధ్యక్షులు గా జి శ్రీరాములు ప్రధాన కార్యదర్శిగా పగడాల లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నిక తెలంగాణ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ .బి సి డబ్ల్యు యు (సిఐటియు అనుబంధం) జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది ఈ జిల్లా సదస్సులో నూతన జిల్లా కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది . బి సి డబ్ల్యు యు జిల్లా గౌరవ అధ్యక్షులు గా జి సాయిలు అధ్యక్షులుగా జి శ్రీరాములు ఉపాధ్యక్షులుగా బి నాగేశ్వరరావు ( పటాన్చెరు )ఎం శ్రీనివాస్ (లింగంపల్లి )మల్లేష్ (సంగారెడ్డి) దుర్గయ్య గౌడ్ (మునిపల్లి) ప్రధాన కార్యదర్శిగా పగడాల లక్ష్మయ్య సహాయ కార్యదర్శులు గా విట్టల్ (రాయికోడ్) చెన్నయ్య (ఆందోల్) నిరంజనమ్మ (ఇస్నాపూర్ ) శ్రీనివాస్ (సంగారెడ్డి) కోశాధికారిగా యు శివ కుమార్ (పటాన్చెరు) కమిటీ సభ్యులుగా నరసింహులు (బుదేరా )మమత (ఇస్నాపూర్) బాల్రాజ్ (లింగంపల్లి) పి.రాములు (పుల్కల్) నరసింహులు (కొండాపూర్ ) మలర్వి ( ఇస్నాపూర్) శక్తీ లక్ష్మీ (చిట్కుల్) యాదయ్య (హత్నూర) తదితరులు *ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు *ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల లక్ష్మయ్య మాట్లాడుతూ జిల్లాలో అనేక భవన నిర్మాణ కార్మికుల దరఖాస్తులు ఆర్థిక సహాయాలు పెండింగ్లో ఉన్నాయన్నారు సంవత్సరం కాలంగా లేబర్ ఆఫీస్ చుట్టూ కార్మికులు చెప్పులు ఆగిపోయేలా తిరుగుతున్నా మన్నారు అయినా ఒక్కసారి ఆర్థిక సహాయాలు కూడా అందకపోవటం బంగారు తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు ఇంత దౌర్భాగ్య దుస్థితి ఏర్పడిందన్నారు సహజ మరణాలు ,యాక్సిడెంటల్ , ప్రసూతి కానుక, పెళ్లి కానుక, అంగవైకల్యం కనుక ,ఇలా అనేక స్కీములు సంవత్సరాల తరబడి అప్లై చేసుకున్న లేబర్ డిపార్ట్మెంట్ నుండి ఇంతవరకు మంజూరు చేయలేదని చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని తెలిపారు తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్స్ అన్నిటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో భవన నిర్మాణ కార్మికులు అందరూ కలిసి సంగారెడ్డి జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వారికి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందన్నారు అనేక ఇబ్బందులు కార్మికులు పడుతున్నారు మరోపక్క కరోనా రెండో వేవ్ ప్రారంభమయ్యాక పనులు దొరకక ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ భవన నిర్మాణ సంక్షేమ మండలి ద్వారా భవన నిర్మాణ కార్మికులు అందరికీ 7500 రూపాయలు 25 కేజీల బియ్యం ఉచితంగా ప్రతి నెల సరఫరా చేయాలని ఈ జిల్లా సదస్సులో తీర్మానించారు ఇప్పటికే కేరళ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు నెలకి 7,500 రూపాయాలు,25 కేజీ ల క బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు పేదలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు అడ్డా కేంద్రాల్లోనే స్పెషల్ డ్రైవ్ తో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.