బీజేపీ పై పోరుకు సిద్ధం : మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్

మహబూబాబాద్ జిల్లా :కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా అగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపధ్ ను తక్షణమే రద్దు చేయాలంటూ కోరుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనిఈ దీక్షలో మాజీ కేంద్రమంత్రి శ్రీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ దిశానిర్దేశం లేకుండా పథకాన్ని రూపొందించారని ఆరోపించారు.దీనికి నిరసనగా యువత చేపట్టే కార్యక్రమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని,ఇంత భారీ స్థాయిలో యువత ఆందోళన వ్యక్తం చేస్తుంటే దీనిని విస్మరించటం సరి కాదన్నారు.వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి,నిరుద్యోగల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.మాజీ సైనికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్లకు 5 ఎకరాల భూమి కేటాయించాలని స్థానిక జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల అధ్యక్షులు,బ్లాక్ అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.