#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

తెలంగాణకు ద్రోహం చేసిన బీజేపీ కేంద్ర బడ్జెట్
కమ్యూనిస్టుల బలోపేతం తోనే పేదల విముక్తి
ప్రారంభమైన సీపీఎం సిరిసిల్ల జిల్లా క్లాసులు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి అబ్బాస్

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు పార్లమెంట్ లోఉన్న మందబలం, అహంభావంతో కలిసిమెలిసి ఉన్న ప్రజలని తమ మతోన్మాద విద్వేషాలతో రెచ్చగొడుతూ మారణహోమం సృష్టించుతుందని,బీజేపీ విధానాలని ఓడించి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి అబ్బాస్ అన్నారు
శుక్రవారం కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామములో సీపీఎం జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. క్లాసుల ప్రారంభ సూచకంగా సీపీఎం జెండాను సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ ఆవిష్కరించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎం డి అబ్బాస్ క్లాసులను ప్రారంభిస్తూ ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పై ప్రమాణం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సీఎం ఎన్నికల ప్రసంగాలు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పారు.యూపీ లో జరుగుచున్న ఎన్నికల్లో తమకు ఓట్లెయ్యకపోతే ప్రజలను బుల్డోజర్లతో తొక్కిస్తామని చెప్పడం పేదలను భయభ్రాంతులకు గురిచేయడమేనని చెప్పారు. మేము 80 మీరు 20 అని చెప్పడం అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడడం కాదా అని ప్రశ్నిoచారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ లక్ష్యాలను తుంగలో తొక్కుతుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతుoదన్నారు.రైతు వ్యతిరేక చట్టాలు కార్మిక చట్టాల రద్దు, దళిత గిరిజనులు మహిళలపై ప్రతీ రోజు హింస జరుగుతుందన్నారు. ఈ విధానాలను ఓడించకుండా దేశ రక్షణ సాధ్యం కాదన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు ఆహార సబ్సీడీలు, ఎరువుల సబ్సిడీలకు కొత పెట్టిందన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ప్రతి ఏటా నిధులు తగ్గించి పేదల ఉపాధి దెబ్బతీసిందన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులోసీఎం ఘోరంగా విఫలమయ్యాడని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ బలపడితేనె పేదలకు మేలు జరుగుతుందని చెప్పారు. కమ్యూనిస్టులను ఆదరిస్తే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు.సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మతం మతోన్మాదం అనే అంశం పై క్లాసు బోధించారు. దోపిడీ దోపిడీ పద్ధతులు అనే అంశం పై క్లాసు బోధించారు. సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు టి స్కైలాబ్ బాబు ప్రసంగించారు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ జవ్వాజి విమల గన్నేరం నర్సయ్య, అన్నల్ దాస్ గణేష్, శ్రీరాం సదానందం మళ్లారపు ప్రశాంత్, గురిజల శ్రీధర్,లతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.