bjp news

ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 11
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి,బూత్ కమిటీ అధ్యక్షులను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పులి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో బిజెపి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని, ఆభగవంతుని ఆశీస్సులతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరుకున్నారు. సామాన్య ప్రజల గురించి ఆలోచించే సంజయ్ అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.బూత్ స్థాయి నాయకులు పొన్నాల రాజు నీరటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.