మేడే కార్మిక దినోత్సవం,రంజాన్ పండుగ
ను పురస్కరించుకొని బీద కార్మికులకు నూతన దుస్తులను పంపిణీ చేయడం అభినందనీయమని స్థానిక పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ మల్లేష్ అన్నారు.ఆదివారం రోజు మండల కేంద్రానికి చెందిన భవన నిర్మాణ సీనియర్ తాపీ మేస్త్రి మహమ్మద్అఫ్జల్ ఆధ్వర్యంలో20 మంది బీద కార్మికులకు నూతన దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమంలో వారు పాల్గొని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో మంచి నీటి ఎద్దడిని నివారించేందుకు మంచినీటి మినీట్యాంకులను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో పథకాలను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. మునుముందు ప్రజల అవసరాలకుఎన్నో సమాజ సేవలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎండి మౌలానా,సిద్ధిఖ్, ఇర్షాద్,ఇలియాజ్,తదితరులు పాల్గొన్నారు.
