బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్

బీజేపీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అయినా బీసీల డిమాండ్లను పరిష్కరించకపోగా..వారి హక్కులను కాలరాస్తున్నారని, దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏది? అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. ఇకనైనా కేంద్రం బీసీల వ్యతిరేక వైఖరిని వీడకపోతే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర రథసారథి జాజుల శ్రీనన్న నేతృత్వంలో అన్ని బీసీ సంఘాలను కలుపుకొని ఆగస్టులో లక్ష మందితో ఢిల్లీని దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీసీ గణన చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతు ఉద్యమ తరహాలో బిసి ఉద్యమాన్ని చేపట్టి ఢిల్లీ పాలకులు దిగివచ్చే వరకు పోరాడతామని హెచ్చరించారు. దేశంలో ఆరు రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానాలు జరిగినా, ఇరవై రెండు పార్టీలు మద్దతు ప్రకటించినా ఇంకా కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి కేవలం రూ.1400 కోట్లు మాత్రమే కేటాయించి అవమానించారని ఆరోపించారు. ఢిల్లీ పాలకులు బీసీల వ్యతిరేకులని.. వెనుకబడిన వర్గాలకు ఒరగబెట్టింది ఏమీ లేదని తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.