బొడ్రాయి ప్రతిష్ట అనేది మహాలక్ష్మి అంశ

ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ రాబోయే కాలం అంతా మంచే జరుగుతుందన్న ఆశావాద దృక్పథం దైవ చింతన ద్వారా అలవడుతతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరు తుందన్నారు . ఆత్మకూరు ఎస్ మండలం రామన్న గూడెం లో కన్నుల పండుగగా సాగుతున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న మంత్రి దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనం అన్నారు.. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు..ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలాంటిదరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారన్నారు.. అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని… ఊరిలోని వారంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యం అని మంత్రి అన్నారు..కార్యక్రమం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్,టి. ఆర్. ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వీ,మండల పార్టీ అధ్యక్షులు తూడి నర్సింహా రావ్ , ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, ఎంపీపీ మర్ల స్వర్ణ లత చంద్రారెడ్డి, సర్పంచ్ అన సూర్య మళ్ళారెడ్డి ,ఎంపీటిసి సింగిల్ విండో డైరెక్టర్ గంగా రెడ్డి, ఎంపి టిసి ఎల్లమ్మ, కన్నయ్య గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న, గ్రామ ప్రజలు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.