బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి

మరిపెడ మండలం,బాల్ని ధర్మారం గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిష్ట తో పాటు హనుమాన్ విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి స్థానిక ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ

కొందరు దేవుడు వారికి మాత్రమే సొంతం అనే విధంగా మాట్లాడుతున్నారు అది సరికాదు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆలయల పున:ప్రతిష్ట ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి 1200 కోట్లతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మరో తిరుపతి ఆలయంగా రూపొందించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది
గ్రామాల్లో సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఎప్పుడూ ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందే బాల్నిధర్మారం మరింత అబివృద్ది చెందాలని అన్నారు ధర్మారం గ్రామ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు నిధులను కేటాయించారు ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీరంగ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి,మధుకర్ రెడ్డి, గూగులోత్ శ్రీ రామ్ నాయక్, వేణుగోపాల్ రెడ్డి,యువ నాయకులు అభినవ్,అశోక్,రామ్ లాల్, వేణుగోపాల్ రెడ్డి, కలం రవీందర్ రెడ్డి,ఇతర నాయకులతో పాటు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.