బోడేపూడి స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు బోడిపూడి వెంకటేశ్వరరావు స్పూర్తితో సమరశీల పోరాటాలకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు యం, సాయిబాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మరెడ్డిలు పిలుపునిచ్చారు.

బోడేపూడి వెంకటేశ్వరరావు 25వ వర్ధంతిని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం(ఆర్టిసీ క్రాస్లెడ్)లో రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అధ్యక్షతన జరిగింది. బోడేపూడి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆయన జీవితం ఆదర్శనీయం, రైతాంగ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు. చిన్న తనంలో తండ్రి మరణించడంతో మేనమామ గ్రామం గందగలపారు వైరా మండలంకు బ్రతుకుదెరువు కోసం వచ్చి మేనమామ ఇంట్లోనే పాలేరుగా తన జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావంతో కమ్యూనిస్టుగా మారాడు. 1985 నుంచి 89, 94 ఎన్నికలలో మధిర అసెంబ్లీ నుంచి గెలుపొందారు.. కేవలం ప్రాధమిక విద్య అభ్యసించిన ఆయన ప్రజలను అధ్యయనం చేసి శాసన సభలో తనదైనశైలిలో అందరిని. మెప్పించేవారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారు. గిట్టుబాటు ధరలు, పంట నష్టపరిహారం కోసం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిగిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు రెండు పంటలకు నీరు అందించే ప్రయత్నం చేశారు. ఫ్లోరైడ్ నీటితో ప్రజలు పడుతున్న జబ్బందులను, అనారోగ్య సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సుజల స్రవంతిని సాధించారు. బోడేపూడి సుజల స్రవంతి నుండి 7 మండలాల ప్రజలకు మంచినీరు సరఫరా జరుగుతుంది. వ్యవసాయాన్ని రైతుల చేతుల నుండి లాక్కొని కార్పోరేట్లో వశం చేస్తున్నారని అన్నారు.

ఏ చిన్న సమస్య తన దృష్టికి వచ్చిన అధికారుల దగ్గరకు తీసుకెళ్ళడం, సమస్య పరిష్కారానికి కృషి చేసేవారు. ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తితో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలి. స్థానిక సమస్యలను జోడించి పోరాటం కొనసాగుతుంది. కామ్రేడ్ బోడేపూడి స్పూర్తితో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇదే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ, కమిటీ సభ్యులు ఆంజనేయులు, సిఐటియు రాష్ట్ర నాయకులు బి మధు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అద్యక్షులు యం. ధర్మానాయక్, రైతు సంఘం నాయకులు భాగ్యలక్ష్మి, కిషోర్, రాహుల్ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.