DYFI జిల్లా కార్యదర్శి తిరుపతి

నిరుద్యోగులు ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలే బోడ సునీల్ మృతికి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి DYFI జిల్లా కార్యదర్శి తిరుపతి
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు అన్నిటికీ టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బోడ సునిల్ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి దోగ్గేల తిరుపతి అన్నారు.
ఈరోజు హన్మకొండ పెద్దమ్మ గడ్డ జంక్షన్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బోడ సునీల్ మృతికి నిరసనగా మహనీయుల విగ్రహాలు దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది, ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేస్తే అదే రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కూడా ప్రాణాలు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే జ్ఞానం టిఆర్ఎస్ ప్రభుత్వం కు లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఇంకా ఎంత మంది ప్రాణాలు త్యాగం చేస్తే ముఖ్యమంత్రి కండ్లు తెరుస్తారని అన్నారు, బొడ సునీల్ మృతి ప్రభుత్వంకు హెచ్చరిక కావాలని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోతుందని ప్రశ్నించే వారిని అణచివేసే చర్యలు మానుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వము నియంతృత్వ పోకడల ను ఆపాలని ఇప్పటికైనా కండ్లు తెరవాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు, సునీల్ మృతికి టిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు జి.రమేష్ ఇ. రాజు, కే , అశోక్, వి, భాస్కర్, రాజేష్, ఇ, చిరంజీవి, రజినీకాంత్, అర్జున్, నవీన్, చింటు, పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.