adsilabad news local news telugu news

గాదిగూడ మండలం పిప్రి గ్రామంలో నీటి ఎద్దడితో అలమటుస్తున్న ఆదివాసీలకు అండగా దివ్యశ్రీ ఫౌండేషన్ నిలిచింది. దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మెన్ ప్రవీణ్ నాయక్ ఆద్వర్యంలో పిప్రి గ్రామంలో బోర్ వెల్ వెయించి మంచినీటి సౌకర్యం కల్పించారు.
గురువారం రాత్రి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లా డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ ల చేతుల మీదుగా బోర్ వెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ముఖ్య అతిథులను గ్రామస్తులు డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు ప్రత్యేక సమావేశం ఎర్పాటు చేయగా.. గ్రామస్తులు వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … పల్లెల్లో ఆదివాసీలు పడుతున్న కష్టాలు చూసి సమాచారం తెలవగానే దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మెన్ ప్రవీణ్ నాయక్ గాదిగూడ మండలంలోని పరస్ వాడతో పాటు పిప్రి గ్రామంలోను గ్రామస్తులకు నూతన బోర్ వెల్ వేయించి త్రాగునీటి సౌకర్యం కల్పించారని, ఇలాంటి సేవలు చేయడం హర్షించదగ్గ విషయమని, తమవంతు కూడా ఎలాంటి సహకారం ఉన్న గ్రామాల్లో అందిస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, ఆసిఫాబాద్‌ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్, దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మెన్ దారావత్ ప్రవీణ్ నాయక్, వైస్ చైర్మెన్ ఆత్రం భీంరావ్, ఎంపిటిసి నాగోరావ్, సభ్యులు దినకర్ షావ్, సురేష్, లింగు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.