భక్తుల ను బెదిరించినపూజారి పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి

శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో గత మంగళవారం ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు గర్భగుడి తలుపులు దేవస్థానం ఉద్యోగులు తెరవలేదు. ఉదయం 7 గంటల వరకు కూడా పూజారి రాకపోవడంతో స్వామివార్లకు ప్రాతఃకాల పూజ జరగ లేదు. ఆరోజు దేవస్థానం కి పోయినా అయ్యప్ప స్వాములు ఫోటోలు తీయడం తో వాట్సాప్ గ్రూపులో వైరల్ గా మారాయి. ఈరోజు గురువారం ఉదయం మళ్ళీ అయ్యప్ప స్వాములు పోగు శ్రీనివాస్, చెన్నూరి సోమనర్సయ్య, బాల గాని యాదగిరి, రాపోలు లక్ష్మణ్ లు వెళ్లారు. పూజారి డి వి ఆర్ శర్మ రూపాయలు 500 టికెట్ తీసుకుంటేనే పైకి అనుమతిస్తామని, దేవస్థానంలో ఫోటోలు తీయడానికి మీరెవరు, నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప లను శివునికి అభిషేకాలు చేయకుండా అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అయ్యప్ప మాలలో ఉన్న స్వాములను శివుడికి అభిషేకం చేయకుండా అడ్డుకోవడం అవమానకరం. డ్యూటీ సరిగా చేయకుండా పూజారి స్వాములను బెదిరించడం విడ్డూరం. ఈవో వీరస్వామి కి జరిగిన విషయం పై ఫిర్యాదు చేశారు.

భక్తుల ను బెదిరించినపూజారి పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి,*పాలకుర్తి మండల కేంద్రంలోని,హరిహర క్షేత్రంలో భక్తులను బెదిరించిన పూజారి పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎం, మండల కార్యదర్శి చిట్యాల సోమన్నడిమాండ్ చేశారు,శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ స్మారక భవనం లో సిపిఎం మండల కమిటీ సమావేశానికి ఇంద్రా రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా సోమన్న ,పాల్గొని మాట్లాడుతూ ఈరోజు అయ్యప్పభక్తుల పట్ల పూజారి వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు,శుక్రవారం రోజున సాములు దర్శనానికి వెళితే పూజారి ₹500 టికెట్ తీసుకుంటే పైకి అనుమతిస్తామని బెదిరించడం సరికాదన్నారు, దేవస్థానం నుండి పూజరులకు జీతం వస్తున్నప్పటికీ అసిస్టెంట్లను పెట్టుకొని పని చేయించుకుంటూ దర్శనానికి వచ్చిన భక్తులను బెదిరించడం మానుకోవాలని వారు అన్నారు,గత నెల రోజులపాటు సిపిఎం మరియు ప్రతిపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేవస్థానం లొలడ్డు పులిహోర లకు టెండర్లు, పెట్టాలని దేవస్థానంలో జరుగుతున్న అవినీతి పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న నిమ్మకునీరెత్తినట్లు గాఅధికారులు ఉన్నారని తెలిపారు,భవిష్యత్తులో ప్రజా సంఘాలు చేసే ప్రజా ఉద్యమాల్లో ప్రజలు మరియు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పాల్గొని దేవస్థానంలో జరుగుతున్న అవినీతిపై, ప్రశ్నించాలని, రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సోమ సత్యం, మండల నాయకులు మాచర్ల సారయ్య ,బానోత్ కిషన్ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు,

50% LikesVS
50% Dislikes

By E69NEWS

2 thoughts on “భక్తుల ను బెదిరించినపూజారి పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి”

Leave a Reply

Your email address will not be published.