కురవి జాతరకు 300మంది పోలీస్ సిబ్బంది.. భక్తుల భద్రత మన బాధ్యత.. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి..
మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలో
మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతర, కళ్యాణోత్సవానికి 300మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మహబూబాబాద్ జిల్లాఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి తెలిపారు.
14 మంది సీఐలు, 34 మంది ఎస్ఐ లతో సహా మొత్తం సిబ్బంది తో కలిపి
300 మంది పోలీస్ లు విధులు నిర్వహిస్తారని తెలిపారు.
మహాశివరాత్రి వేళలో కురవి వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు.. భక్తుల భద్రత మా..బాద్యతగా విధులు నిర్వహిస్తామన్నారు.. భక్తులు సమన్వయంతో క్యూలైన్ పాటించి దర్శనం చేసుకోవలసిందిగా కోరారు.
కోవిడ్-19 దృష్ట్యా పోలీస్ సిబ్బంది, ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసి ఆలయానికి రావలసిందిగా కోరారు
